ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Covid vaccine At Home: ఇక ఇంటింటికీ రాత్రిపూట కూడా కొవిడ్ టీకాలు... - తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు కొవిడ్ వాక్సిన్ అందజేత

కొవిడ్ టీకాలు ప్రజలందరికీ చేరుకునే దిశగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవడంతో చివరి ప్రయత్నంగా రాత్రిపూట గ్రామాల వారీగా ఇంటింటికి వెళ్లి టీకాలు వేసేలా ఆరోగ్య శాఖ సిబ్బందిని సమాయత్తం చేసింది.

Covid vaccine At Home
ఇక ఇంటింటికీ రాత్రిపూట కూడా కొవిడ్ టీకాలు...

By

Published : Sep 29, 2021, 2:20 PM IST

కొవిడ్ టీకాలు ప్రజలందరికీ చేరుకునే దిశగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవడంతో చివరి ప్రయత్నంగా రాత్రిపూట గ్రామాల వారీగా ఇంటింటికి వెళ్లి టీకాలు వేసేలా ఆరోగ్య శాఖ సిబ్బందిని సమాయత్తం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో అన్ని గ్రామాల్లో సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ప్రతిరోజు ముందస్తు సమాచారం అందించి టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామ సచివాలయ ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి ఆశావర్కర్లు, మండల స్థాయి ఆరోగ్య కేంద్ర ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణలో ఆయా గ్రామాల్లో టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details