తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో ప్రజలు రాక కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు వెలవెలబోయాయి. కోవిషీల్డ్ మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకుని 84 రోజులు పూర్తైన వారికి రెండో డోసు వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు.
8500 మందికి రెండో డోసు వ్యాక్సిన్ వేసేందుకు డివిజన్లో 22 కేంద్రాలు సిద్ధం చేశారు. ఐతే 84 రోజులు పూర్తైన వారు డివిజన్ మొత్తం మీద 600మంది వచ్చారని.. వారికి రెండో డోసు టీకాలు వేశామని డివిజన్ అడిషనల్ డీఏంహెచ్ఓ డాక్టర్. సిహెచ్ పుష్కరరావు వెల్లడించారు.