తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 590 మందికి కోవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయగా.. 230 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. వారికి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మందులు పంపిణీ చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తుందని.. స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ప్రజలు కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయించుకోడానికి భయపడుతున్నారని… కొందరు నిర్ధారణ అయిన బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాల వారికి ఉచితంగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. అక్కడే ఉచితంగా మందుల పంపిణీ చేస్తున్నామని వివరించారు.
కోవిడ్ బాధితులు బయట తిరగొద్దు: ఎమ్మెల్యే
కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆలమూరు పోలీస్స్టేషన్ పరిధిలో 590 మందికి కోవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయగా.. 230 మందికి పాజిటివ్ వచ్చింది. వారికి ఎమ్మెల్యే మందులు పంపిణీ చేశారు.
వైద్యసిబ్బందితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే