కొవిడ్ ఉద్ధృతంగా వ్యాపిస్తుండడంతో అటు ప్రజలతో పాటు.. ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు వైరస్ బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద.. ప్రజలు నేరుగా అధికారులను సిబ్బందిని కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా కారణంగా లోపలికి ఇతరులు రాకూడదని బోర్డులు ఏర్పాటు చేసి.. ప్రవేశ ద్వారం వద్ద పెట్టారు. ప్రజల నుంచి అర్జీలను ఫోన్ల ద్వారా విజ్ఞప్తి చేయవచ్చునని తెలిపారు.. ఈ విధంగా సాధ్యం కానివారు దరఖాస్తు రూపంలో బయట ఏర్పాటు చేసిన తొట్టిలో వేయాలని సూచిస్తున్నారు.
'దరఖాస్తులు బయట ఉన్న తొట్టిలో వేయండి' - అమలాపురం డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలు న్యూస్
ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది వైరస్ బారిన పడుతుండటంతో.. జాగ్రత్తలు చేపడుతున్నారు. ప్రజలను నేరుగా కలవకుండా.. ఫోన్ల ద్వారా కానీ, అర్జీల ద్వారా గాని ఫిర్యాదులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు.
!['దరఖాస్తులు బయట ఉన్న తొట్టిలో వేయండి' covid safety arrangements](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11566312-318-11566312-1619598693851.jpg)
ప్రభుత్వ కార్యాలయాలు