ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజోలులో కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు - razole covid comand control center

తూర్పు గోదావరి జిల్లా రాజోలులో కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ.. వైరస్ పై అపోహాలను నివృత్తి చేసుకుని, తగిన సలహాలు పొందాలని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

covid comand center
కోవిడ్ కమాండ్ కేంద్రం

By

Published : May 8, 2021, 4:16 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజోలులో కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు శనివారం ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలో ప్రజలు కరోనా లక్షణాలతో బాధపడుతున్నా, అనుమానాలు ఉన్నా, గందరగోళ పరిస్థితుల్లో ఉన్న వారెవరైనా ఆ కేంద్రానికి ఫోన్ చేసి సమస్యలు నివృత్తి చేసుకోవాలన్నారు.

రాజోలు నియోజకవర్గ ప్రజల కోసం ఈ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఇద్దరు మహిళా సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారని.. 9347357739 నెంబర్ కి ఫోన్ చేసి సూచనలు తీసుకోవాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ చాలా ఉద్ధృతంగా ఉన్నందున ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details