తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 29 కేసులు బయటపడ్డాయి. జిల్లాలో పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 273కి చేరింది. గొల్లలమామిడాడలో 8 మందికి కొత్తగా కరోనా వచ్చింది. ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 116కు పెరిగింది. రాజమహేంద్రవరం, మండపేట, రాజోలు తదితర ప్రాంతాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ముంబై నుంచి వచ్చినవారిని రాజోలు క్వారంటైన్‌లో ఉంచి 18 మందికి పరీక్షలు చేస్తే 9 పాజిటివ్ వచ్చింది. ఈరోజు రావులపాలెం, రాజోలు, అయినవిల్లి, జి.మామిడాడ, అనపర్తి తదితర ప్రాంతాల్లోనూ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
జిల్లాలో విజృంభిస్తున్న కరోనా - latest news of covid cases
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా నమోదైన కేసులతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 273కు చేరింది.
covid cases increasing in east godavari dst daily