ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమలో 114 గ్రామాలను చుట్టుముట్టిన కరోనా - ఏపీలో కరోనా కేసుల వార్తలు

కోనసీమ ప్రాంతంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం రాత్రి వరకు కోనసీమ వ్యాప్తంగా 1380 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కోనసీమలో 114 గ్రామాలను చుట్టుముట్టిన కరోనా
కోనసీమలో 114 గ్రామాలను చుట్టుముట్టిన కరోనా

By

Published : Jul 29, 2020, 4:54 PM IST



తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జులై 28 రాత్రి వరకు కోనసీమ వ్యాప్తంగా 1380 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అమలాపురం డివిజన్ అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ సీహెచ్ పుష్కర రావు వెల్లడించారు. మొత్తం 273 గ్రామ పంచాయతీలు కోనసీమలో ఉన్నాయి. వీటిలో 114 గ్రామాలలో ఈ మహమ్మారి విస్తరించింది. 139 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు పదేపదే సూచిస్తున్నారు.

కోనసీమలో 114 గ్రామాలను చుట్టుముట్టిన కరోనా

ABOUT THE AUTHOR

...view details