ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్యంతో సతమతమవుతున్న దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజమహేంద్రవరంలో ఏవీ అప్పారావు రోడ్డులోని బాబానగర్‌కు చెందిన సతీష్, వీర వెంకటలక్ష్మి పెట్రోలు పోసుకుని నిప్పంటిచుకుని సజీవ దహనమయ్యారు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న సతీశ్ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని భార్య కూడా అనారోగ్యం పాలవడంతో ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
రాజమహేంద్రవరంలో దంపతుల ఆత్మహత్య
రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెట్రోల్ పోసుకుని ఆటోడ్రైవర్ సతీశ్, భార్య వెంకటలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
couple-suicide-in-rajamahendravaram