ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శునకానికి పెద్దకర్మ ... ప్లెక్సీలతో అనుబంధాన్ని చాటుకున్న ఓ కుటుంబం

శునకాలు విశ్వాసానికి మారు పేరు. అవి ఇంట్లో ఉన్నాయంటే యజమానికి కొండంత భరోసా. వీటిని కొందరు కాపలా కోసం పెంచుకుంటే.. మరికొందరు సరదా కోసం పెంచుకుంటారు. ఇంట్లో సభ్యుడిగా చూసుకుంటారు. వాటికి ఏమీ కాకుండా జాగ్రత్తపడతారు. అంత ప్రేమగా చూసుకుంటున్న శునకం చనిపోవటంతో ఓ కుటుంబం తల్లడిల్లింది. అనంతరం ఆ శునకానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.

శునకానికి పెద్దకర్మ
శునకానికి పెద్దకర్మ

By

Published : Mar 25, 2022, 9:24 PM IST

శునకానికి పెద్దకర్మ ... ప్లెక్సీలతో అనుబంధాన్ని చాటుకున్న ఓ కుటుంబం

అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం చనిపోవడంతో ఓ కుటుంబం తల్లడిల్లిపోయింది. శునకం బంధం తెగిపోవడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చనిపోయిన ఆ శునకానకి అంత్యక్రియలు నిర్వహించటంతో పాటు.. పెదకర్మ చేసి యాభై మందికి భోజనాలు సైతం పెట్టారు ఆ కుటుంబం. అంతే కాకుండా ఆ శునకానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయా సెంటర్లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగింది.

పిఠాపురం పట్నానికి చెందిన లోవరాజు, కుమారి దంపతులు నాలుగు నెలల క్రితం కాకినాడ నుంచి ఓ ప్రత్యేకమైన కుక్కను తెచ్చుకున్నారు. దానికి ముద్దుగా శాండీ బాబు అని నామకరణం సైతం చేసి.. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇటీవల ఆ శునకం ఆనారోగ్యానికి గురై మృతి చెందింది.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన లోవరాజు, కుమారి దంపతులు .. తమ సొంత కుటుంబసభ్యులను కోల్పోయినంతగా బాధపడ్డారు. శునకంపై పెంచుకున్న మమకారంతో సంప్రదాయం ప్రకారం దానికి అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం శాండీ బాబు(శునకం)కు శ్రద్ధాంజలి ఘటిస్తూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:పెంచిన మనసు విలవిల.. పెంపుడు కుక్కకు అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details