Suicide in Lodge: లాడ్జిలో వివాహిత దారుణ హత్య
22:47 September 20
కాకినాడలో వైద్య విద్యార్థిని దారుణ హత్య
కాకినాడ నగరంలోని ఓ లాడ్జిలో మహిళ(వైద్య విద్యార్థిని) దారుణ హత్యకు (medical student murder) గురైంది. మహిళ మెడపై బలమైన గాయాలు ఉండటంతో ఇది హత్యగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశాలతో క్లూస్‌టీమ్ రంగంలోకి దిగింది. కాకినాడ డీఎస్పీ వి.భీమారావు, రెండో పట్టణ సీఐ ఈశ్వరుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం యాళ్లగూడేనికి చెందిన మానేపల్లి గంగరాజు(21), తాడేపల్లిగూడెం మండలం కాకిపాడుకు చెందిన గుంపుల సుధారాణి(19) ప్రేమించుకుని ఇటీవల వివాహం చేసుకున్నారు. వీరు ఈనెల 17న కాకినాడలోని కోకిల కూడలిలోని లాడ్జిలో దిగారు. ఈ సమమంలో వీరి చిరునామాలను ధ్రువీకరించే ఆధార్‌కార్డుల నకళ్లు అందజేశారు. రెండు రోజులపాటు వీరు బస చేశారు. సోమవారం తెల్లవారు వీరు గొడవపడినట్లు, సుధారాణిని ఆమె భర్త గంగరాజు కత్తితో పొడిచి హత్య చేసి పరారైనట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఇరువురి మధ్య ఏం జరిగింది, ఎందుకు హత్య వరకు దారితీసింది అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హత్యకు గురైన సుధారాణి కాకినాడ నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం ఎనస్తీషియా డిప్లమో కోర్సు చదువుతున్నట్లు ప్రాథమిక సమాచారం. దీన్ని మాత్రం పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ భీమారావు విలేకరులతో మాట్లాడుతూ ఆధార్‌కార్డు ఆధారంగా హత్య(woman murder at kakinada)కు గురైన మహిళ వివరాలు సేకరించామని, బంధువులకు సమాచారం అందిస్తామని చెప్పారు. ప్రాథమికంగా హత్యకేసుగా నమోదు చేస్తున్నామని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ముమ్మరం చేస్తామని తెలిపారు. మహిళ మెడపై కత్తితో దాడి చేసిన బలమైన గాయాలు ఉన్నాయని, రక్తపు మడుగులో పడి ఉందని చెప్పారు. మరోవైపు నిందితుడు గంగరాజు పశ్చిమగోదావరి జిల్లా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
ఇదీచదవండి.