ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొల్లల మామిడాలకు ఏమైంది? ఇన్ని కరోనా కేసులా? - carona virus update in east godavari

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్‌ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సోమవారం 24 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదుతో జిల్లాలో వైరస్ బాధితుల సంఖ్య 123కు చేరింది. అయితే వీరిలో 75 మంది చికిత్స పొందుతుండగా 46మంది కోలుకొని ఇళ్లకు చేరారు.

east godavari district
జిల్లాలో అలజడి రేపుతున్న.. పెదపూడి మండలం

By

Published : May 27, 2020, 7:23 AM IST

అయిదు రోజుల కిందటి వరకు తక్కువ కరోనా కేసులు ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో.. పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలోని పాజిటివ్‌ కేసుతో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. జిల్లాలో సోమవారానికి 123 కేసులు ఉండగా దానిలో 53 కేసులు జి.మామిడాడకు అనుబంధంగా నమోదయ్యాయి. ఈ కేసులన్నీ పెదపూడి మండలంతోపాటు రామచంద్రపురం, బిక్కవోలు, మండపేట, తుని, మండలాల్లో వెలుగు చూశాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమై మామిడాడ , బిక్కవోలు మండలాల్లో అధిక సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మంగళవారం ఉదయానికి తూర్పు గోదావరి జిల్లా జి. మామిడాడకు సంబంధించి మరో 19 మందికి పాజిటివ్ నమోదు కాగా బిక్కవోలులోని 5 సంవత్సరాల బాలుడికి కొరోనా సోకింది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అధికార యంత్రాంగం జి. మామిడాడ, బిక్కవోలు కొన్ని రహదారులు మూసి వేసి రాకపోకలు నిలిపేసింది. అదే విధంగా రామచంద్రాపురం, మండపేటలో ఆంక్షలు విధించారు.

ABOUT THE AUTHOR

...view details