తూర్పుగోదావరి జిల్లా మండపేటలో.. ఇంటి నుంచి అదృశ్యమైన వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. స్థానిక శ్రీనగర్ కాలనీకి చెందిన ధాన్యం వ్యాపారి మాండ్రు పనసరామన్న (47) ఈ నెల 14 అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధువుల ఫిర్యాదుపై 15న కేసు నమోదు చేశామన్నారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన వ్యక్తి ఈయనకు దగ్గర బంధువు కావడంతో పాటు వారితో రెండు రోజుల పాటు కలిసి ఉన్నారు. అప్పటికే ఈయనకు దగ్గు, ఆయాసం ఉండటంతో తనకు భయం పట్టుకుందని కుటుంబసభ్యుల వద్ద తరచూ ఆందోళన చెందేవారని చెప్పారు.
అదృశ్యమైన ధాన్యం వ్యాపారి అనుమానాస్పద మృతి
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఇంటి నుంచి అదృశ్యమైన ధాన్యం వ్యాపారి మాండ్రు పనసరామన్న(47) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ నెల 14న ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన సమీప బంధువొకరు కరోనా మృతి చెందడంతో.. తనకు కరోనా వస్తుందన్న అనుమానం ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని మండపేట ఎస్సై తెలిపారు.
ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలు లేవని... కేవలం కరోనా వస్తుందన్న భయం వల్ల ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం శ్రీలక్ష్మీనగర్ కాలనీ సమీపంలో పంట బోదెలో లభ్యమైన మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. బంధువుల సాయంతో మృతదేహం పనసరామన్నదిగా గుర్తించారు. మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ ఉనట్లు కమిషనర్ టి.రామ్‌కుమార్ తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.సునీత తెలిపారు.
ఇదీ చదవండి :మద్యం కోసం మహిళలు క్యూ.. దీని వెనక ఓ కథ ఉందండోయ్