తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో... ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బందికి కొవిడ్ టీకా వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వాసుపత్రిలో.. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులకు టీకా వేశారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రత్యేక బలగాలకు టీకాలు అందించినట్లు తెలిపారు. యానంకు చెందిన 200 మంది, ఎన్నికల ప్రత్యేక బలగాలైన 90 మందికి టీకా వేసినట్లు సీఐ గూటం శివగణేష్ తెలిపారు. యానాంలో వచ్చే నెల ఆరో తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.