తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మండలంలో ఆయనతో గత పది రోజుల నుంచి మాట్లాడుతున్న ఉపాధ్యాయులు కలవరపడుతున్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి పీఏకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ ప్రధానోపాధ్యాయుడు ఆయనకు బంధువు. ఆయన నుంచి ఈయనకు వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. ఈ మండలంలో ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడిన ఏడుగురు ఉపాధ్యాయులను హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించామని వైద్యాధికారి సుబ్బరాజు తెలిపారు.
పి.గన్నవరంలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా - పి.గన్నవరంలో కరోనా
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మండలంలో ఆయనతో గత పది రోజుల నుంచి మాట్లాడుతున్న ఉపాధ్యాయులు కలవరపడుతున్నారు
![పి.గన్నవరంలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా Corona to the Headmaster of Government Primary School at P.Gannavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7884610-868-7884610-1593833604440.jpg)
పి.గన్నవరంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా