ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ కార్యదర్శికి కరోనా.. కూర్చున్న చోటే ఆగిన ఊపిరి - Covid to ps news today

కరోనా బారిన పడిన పంచాయతీ కార్యదర్శి విధులు నిర్వర్తిస్తూనే కుర్చీలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మల్లేపల్లిలో చోటు చేసుకుంది.

పంచాయతీ కార్యదర్శికి కరోనా.. కూర్చున్న చోటే గాల్లో కలిసిన ప్రాణం
పంచాయతీ కార్యదర్శికి కరోనా.. కూర్చున్న చోటే గాల్లో కలిసిన ప్రాణం

By

Published : Apr 30, 2021, 6:28 PM IST

పంచాయతీ కార్యదర్శికి కరోనా.. కూర్చున్న చోటే గాల్లో కలిసిన ప్రాణం

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ కార్యదర్శి పాణింగపల్లి జయశంకర్ నారాయణ విధులు నిర్వహిస్తూ సచివాలయంలోనే మృతి చెందారు.

కుర్చిలోనే ఆగిన ఊపిరి..

శంకర్ నారాయణ గత నాలుగు రోజులుగా కొవిడ్ లక్షణాలుతో బాధ పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిబ్బంది ఆందరూ ఉండగానే కూర్చున్న కుర్చీలోనే ప్రాణం విడవడం తోటి ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. మృతదేహానికి కొవిడ్​ పరీక్ష నిర్వహించగా పాజిటీవ్​గా నిర్ధరణ అయ్యింది.

భయంతో కావచ్చు..

జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో కరోనా అని తెలియడంతో భయంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండవచ్చని సిబ్బంది భావిస్తుండటం గమనార్హం.

ఇవీ చూడండి :ఎలక్షన్‌ కమిషన్‌లో పిటిషన్‌ వేసుకోండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details