తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం పాలగుమ్మి గ్రామంలో ఓ బార్బర్‌కు కరోనా సోకింది. దీంతో పరిసర ప్రాంతాలకు సంబంధించి 162 కుటుంబాలను రెడ్ జోన్‌గా ప్రకటించామని అమలాపురం ఎంపీడీవో ఎం. ప్రభాకర్‌రావు తెలిపారు. ఆ బార్బర్ సమీప గ్రామమైన ఎల్ పెదపాలేనికి చెందిన కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి క్షవరం చేశాడు. దీంతో బార్బర్‌కు కరోనా సోకింది.
కరోనా సోకిన వ్యక్తికి క్షవరం.. బార్బర్‌కు సోకిన మహమ్మారి - తూర్పు గోదావరిలో మంగలికి కరోనా
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం పాలగుమ్మి గ్రామంలో ఓ బార్బర్‌కు కరోనా నిర్ధరణ అయ్యింది. పక్క గ్రామంలో ఉన్న కరోనా సోకిన వ్యక్తికి క్షవరం చేయడంతో అతడికి వైరస్ సోకింది.
బార్బర్ కు కరోనా
బార్బర్ కుటుంబ సభ్యుల నమూనాలు వైద్యులు సేకరించారు. వాటి ఫలితాలు రావాల్సి ఉందని ప్రభాకర్‌రావు వెల్లడించారు. బార్బర్ ద్వారా ఇంకా ఎవరికైనా సోకిందా అని అధికారులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: 'లాక్డౌన్ పాక్షిక సడలింపులు.. నిబంధనలు తప్పనిసరి'