తూర్పుగోదావరి జిల్లాలో రోజుకు నాలుగు వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంచార సంజీవని వాహనాల ద్వారా ముమ్మర పరీక్షలు చేయాలని సూచించారు. ఈ బస్సుల ద్వారా జిల్లాలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో సులభంగా నమూనాల సేకరణకు వీలుంటుందని అధికారులు తెలిపారు. ఒకే సమయంలో పదిమందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా అన్ని రకాల సదుపాయాలను ఈ వాహనాల్లో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
కరోనా పరీక్షలకు సంజీవని బస్సులు సిద్ధం
సంజీవని వాహనాల ద్వారా రోజుకు నాలుగు వేల వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ వాహనాలతో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముమ్మర పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
కరోనా పరీక్షలకు సంజీవని బస్సులు సిద్ధం