తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం రాజుల ఏనుగుపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌గా అధికారులు నిర్ధరించారు. దీంతో గ్రామంలో 27 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 28 మంది నుంచి నమూనాలు సేకరించేందుకు ఏర్పాట్లు చేయగా 27 మంది వచ్చినట్లు వైద్యాధికారి కె.సుబ్బరాజు తెలిపారు.
ఆ నలుగురికి కరోనా పాజిటివ్... ఇంట్లోనే చికిత్స - కరోనా తాజా వార్తలు
ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో... తూర్పు గోదావరి జిల్లా రాజుల ఏనుగుపల్లిలో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో మరో 28 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా బాధితులకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పలువురికి పరీక్షలు
పరీక్షలు నిర్వహించుకునేందుకు ఒకరు గైర్హాజరు కాగా పాజిటివ్ వచ్చిన నలుగురికి వారి ఇంట్లోనే వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యాధికారి సుబ్బరాజు వెల్లడించారు.
ఇవీ చూడండి...