తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్ఛందంగా ఆయా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. సంజీవిని బస్సుల ద్వారా రాపిడ్ టెస్టులు చేయటం.. ఫలితాలు సైతం వేగంగా వస్తుండటంతో కరోనా అనుమానితులు పరీక్షలు చేయించుకునేందుకు తరలివస్తున్నారు.
కరోనా పరీక్షలకు స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రజలు
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరగుతుండటంతో... ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా... స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేందుకు సంజీవని బస్సుల వద్దకు తరలివస్తున్నారు.
కరోనా పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ప్రజలు