కరోనా విజృంభిస్తున్న వేళ తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో అంతరాలయం దర్శనాలను నిలుపుదల చేశారు. ఫలితంగా దిగువ అంతస్తులో ఉన్న యంత్రాలయంలోకి సైతం భక్తులను అనుమతించడం లేదు. పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు దర్శనానికి అనుమతించవద్దని ఈవో త్రినాథరావు ఆదేశాలు జారీ చేశారు.
కరోనా ఎఫెక్ట్ : అన్నవరంలో అంతరాలయ దర్శనం నిలిపివేత - అన్నవరం గుడి కరోనా నిబంధనలు
కరోనా నేపథ్యంలో అన్నవరం దేవస్థానంలో చర్యలు చేపట్టారు. దేవస్థానంలో అంతరాలయం దర్శనాలను నిలుపుదల చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దిగువ అంతస్తులో ఉన్న యంత్రాలయంలోకీ భక్తులను అనుమతించడం లేదు.
సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు భక్తులకు శటారీ, తీర్థం, ఉచిత ప్రసాద వితరణ నిలుపుదల చేశారు. పూర్ణకుంభ స్వాగతం, పూల మాలలు వేయడం, ఆశీర్వచనం వంటి ప్రోటో కాల్‌ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలుపుదల చేయాలని ఈవో ఆదేశించారు. దర్శనాల సమయంలో భక్తులు భౌతిక దూరం పాటించేలా, కానుకలు సమయంలో హుండీలను తాకకుండా ఉండేలా, కుళాయిలు వద్ద నోటిని శుభ్రం చేసుకోవడం తదితర పనులు చేయకుండా శుచి శుభ్రతపై అవగహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: షాకింగ్: 99 ఏళ్లపాటు ప్రై'వేటు' చేతుల్లోకి బెజవాడ రైల్వే స్టేషన్..!