కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానంలో కరోనా కేసులు విజృంభిస్తున్నందున అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే.. నిత్యావసర దుకాణాలు తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన దుకాణాలు మధ్యాహ్నం రెండు గంటలకు మూసివేయాలని యానం డిప్యూటీ కలెక్టర్ అమన్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.
యానాంలో కరోనా ఉద్ధృతి.. వ్యాపార సమయాల్లో కుదింపు - corona cases in puducherry
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానంలో కరోనా కేసులు పెరుగుతున్నందున.. అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. వ్యాపార సమయాలు కుదించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరవాలని ఆదేశించారు.
corona cases in yanam
హోటళ్లను రాత్రి పదింటి వరకు అనుమతించి పార్సిల్ ద్వారా మాత్రమే వినియోగదారులకు అందించాలని సూచించారు. ఈ నిబంధనలు ఈనెల 30వ తేదీ వరకు అమలులో ఉంటాయని అన్నారు. అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ హెచ్చరించారు. కేసుల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరు స్వీయ రక్షణలో ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి:2023 మార్చి నాటికి అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్: సీఎం జగన్