తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట రెడ్‌జోన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్తపేట సంత మార్కెట్ ఏరియాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో రెడ్‌జోన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన ముగ్గురు బాధితులకు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స అందించారు. వారికి పరీక్షలు నిర్వహించగా... ఒకరికి నెగెటివ్ రావటంతో డిశ్ఛార్జ్ చేశారు.
కొత్తపేట రెడ్‌జోన్‌లో ర్యాపిడ్ కిట్లతో కరోనా పరీక్షలు - కొత్తపేట రాపిడ్ టెస్టులు
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట రెడ్‌జోన్ పరిధిలో ఇంటింటికీ.. ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్తపేటలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
![కొత్తపేట రెడ్‌జోన్‌లో ర్యాపిడ్ కిట్లతో కరోనా పరీక్షలు rapid tests in kothapet market area](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6937172-182-6937172-1587820797604.jpg)
కొత్తపేటలో కరోనా రాపిడ్ టెస్టులు