తూర్పుగోదావరి జిల్లాలో తాజాగా 1504 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారుగు విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. వీరిలో 1122 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. తాజాగా 906 మందిని డిశ్ఛార్జి చేశారు. అత్యధికంగా కాకినాడలో 318, రాజమహేంద్రవరంలో 290 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తుని మండలంలో 123, అమలాపురంలో 74, కాకినాడ గ్రామీణంలో 72, పెద్దాపురం 54, రాజమహేంద్రవరం గ్రామీణంలో 51, జగ్గంపేటలో 45 చొప్పున కేసులు నమోదయ్యాయి.
రావులపాలెం మండలంలో 36, కాజులూరులో 33, మామిడికుదురులో 26, పెదపూడిలో 23, ఉప్పలగుప్తంలో 22, బిక్కవోలు, రామచంద్రపురం మండలాల్లో 21చొప్పున తొండంగి మండలంలో 20 పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని కొవిడ్ కేర్ సెంటర్లలో గురువారం నాటికి 2138 మంది ఉన్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూకేలో 863 మంది, బొమ్మూరులో 651 మంది, బోడసకుర్రులో 550 మంది, చింతూరులో 46, రంపచోడవరంలో 28 మంది చొప్పున ఉన్నట్లు వివరించారు. అనుమానిత లక్షణాలతో రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో 281 మంది, కాకినాడ జీజీహెచ్లో 23 మంది చికిత్స పొందుతున్నారు. బొమ్మూరు క్వారంటైన్ కేంద్రంలో 651 మంది ఉన్నారు.