ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెనికేరులో కరోనా పాజిటివ్ కేసు నమోదు - corona cases latest news in east godavari

తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో కరోనా పాజిటివ్​ కేసు నమోదయ్యింది. గ్రామంలో ఇటీవల మృతిచెందిన లారీ డ్రైవర్​ తమ్ముడికి పాజిటివ్​ రావటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు గ్రామంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు.

పెనికేరులో కరోనా పాజిటివ్ కేసు నమోదు
పెనికేరులో కరోనా పాజిటివ్ కేసు నమోదు

By

Published : Jun 17, 2020, 5:26 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెనికేరులో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. గత నెల 29న ఆ గ్రామంలో ఓ లారీ డ్రైవర్ మృతిచెందాడు. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించడానికి వైద్య బృందం ప్రయత్నించగా... కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పి దహన కార్యక్రమాలు చేశారు. అయితే ప్రస్తుతం అతని తమ్ముడికి కరోనా లక్షణాలు ఉన్నాయని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేయగా అతనికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న పెనికేరు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరవై రోజులుగా అతను ఎంతోమందిని కలిసి ఉంటాడని అంటున్నారు.. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమై ఆ గ్రామంలో పారిశుద్ధ్య పనులను చేపట్టినట్లు ఎంపీడీవో ఝాన్సీ తెలిపారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 351 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details