ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యానాం ఎన్నికలు: పీపీఈ కిట్లు ధరించి ఓటేసిన కరోనా బాధితులు

కరోనా సోకిన 15 మందికి యానాంలో ఓటు వేసేందుకు ఎన్నిల సంఘం అవకాశం కల్పించింది. ఆస్పత్రి సిబ్బంది వారిని పూర్తి రక్షణతో పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి, తిరిగి ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేసింది. పీపీఈ కిట్లు ధరించి వచ్చిన 8 మంది కొవిడ్ బాధితులు ఓటుహక్కును వినియోగించుకున్నారు.

By

Published : Apr 6, 2021, 10:43 PM IST

Published : Apr 6, 2021, 10:43 PM IST

yanam elections, covid patients casted vote in yanam elections
యానాంలో ఎన్నికలు, యానాంలో ఓటేసిన కరోనా బాధితులు

పీపీఈ కిట్ ధరించి ఓటేస్తున్న కరోనా బాధితుడు

కేంద్ర పాలిత యానాం నియోజకవర్గంలో కరోనా చికిత్స పొందుతున్న బాధితులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య కాలంలో వీరికి ప్రత్యేక సమయాన్ని కేటాయించింది. యాానాంలో 25 యాక్టివ్ కేసులు ఉండగా 15 మంది ఓటు వేసేందుకు అనుమతి తీసుకున్నారు.

వీరిని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పూర్తి రక్షణ కవచాలతో తీసుకొచ్చి తిరిగి వారిని ఇంటికి చేర్చేందుకు ఏర్పాటు చేశారు. వారికి కేటాయించిన సమయంలో ఎనిమిది మంది మాత్రమే ఓటు వేసేందుకు తమ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. ఆ సమయంలో ఎన్నికల సిబ్బంది కూడా పూర్తి రక్షణ కవచాలు ధరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details