తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం యువకుడికి కరోనా పరీక్ష నిర్వహించగా.. నెగెటివ్ అని తేలింది. విజయవాడకు చెందిన ఒక యువకుడికి ఈనెల 8వ తేదీన కరోనా పాజిటివ్ వచ్చింది. అతని స్నేహితుడైన రావులపాలెం యువకుడితో కలిసి దిల్లీ నుంచి విమానంలో రాష్ట్రానికి వచ్చారు. విషయం తెలుసుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రావులపాలెం యువకుడిని వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ తరలించి పరీక్షించారు. అతడికి నెగటివ్ అని తేలగా.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రావులపాలెం యువకుడికి కరోనా నెగెటివ్ - lockdown in ravulapalem
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు 12 చేరాయి. జిల్లాలోని రావులపాలెం యువకుడికి వైద్యపరీక్షల్లో కరోనా వైరస్ నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది.
రావులపాలెం యువకుడికి కరోనా నెగెటివ్