కరోనా వేళ వివాహాలు, వేడుకలు జరుపుకొనేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అనుమతి ఇచ్చినా కొద్దిమంది అతిథులతోనే పెళ్లిల్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ తూర్పురోడ్డులో ఓ జంట కరోనా నిబంధనలు పాటిస్తూ ఒక్కటైంది. కొద్దిమంది బంధువులు పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఘనంగా చేసుకోవాల్సిన పెళ్లిని ఇలా సాదాసీదాగా జరుపుకొన్నామని నూతన జంట పేర్కొన్నారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ ఒక్కటైన జంట - కరోనా సమయంలో వివాహాలు
కరోనా వ్యాప్తితో వివాహాలు చేసుకునే వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఘనంగా చేసుకోవాల్సిన పెళ్లిని .. సాదాసీదాగా జరుపుకోవాల్సి వస్తోందని ఓ నూతన జంట అంటున్నారు.
![కరోనా నిబంధనలు పాటిస్తూ ఒక్కటైన జంట corona marriages](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7194782-691-7194782-1589454430482.jpg)
corona marriages