కరోనా వ్యాప్తి చెందుతూ భయాందోళనలకు గురిచేస్తున్నా... జాగ్రత్తలు పాటించాలని పోలీసులు, అధికారులు మొత్తుకుంటున్నా కొంత మందిలో మార్పు రావడం లేదు. తూర్పు గోదావరిజిల్లా తుని మండలం వెంకటాపురం శివారులోని చెరువు గట్టువద్ద... చేపల కోసం కొంతమంది ఎగబడిన ఇలాంటి తీరు ఆందోళనకు గురి చేస్తుంది. భౌతిక దూరం పాటించకుండా.. చిన్నా పెద్దా అంతా ఒకే చోట గుమిగూడారు. ఇలా అయితే కరోనా రాక మరేం చేస్తుందని స్థానికులు మండిపడుతున్నారు.
ఎన్ని సార్లు చెప్పినా మారం.. మేం ఇంతే!
వారి తీరు చూస్తుంటే.. ఎన్ని సార్లైనా చెప్పండి.. మాలో మార్పు రాదు అన్నట్టుగానే ఉంది. గుంపులుగా వద్దు.. భౌతిక దూరం ముద్దు అని చెప్పినా వారికి పట్టడం లేదు. కేవలం చేపల కోసం కరోనా తెచ్చుకుంటాం... అన్నట్టుగా వారంతా గుమిగూడడంపై అంతా మండిపడుతున్నారు.
corona lockdown not followed by venkatapuram village people near thuni in east godavri