ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేపల వేటకు రంగం సిద్ధం - మత్స్యకారులపై లాక్ డౌన్ ప్రభావం వార్తలు

లాక్ డౌన్ సడలింపులతో మత్స్యకారులకు కొంత ఊరట లభించింది. ఇన్నీ రోజులు జీవన నావ సాగక ఢీలా పడ్డ వారంతా వేటకు సిద్ధమవుతున్నారు. చేపల వేటకు అవసరమైన పరికరాలను బోట్లలోకి చేరుస్తుండటంతో జెట్టీల వద్ద సందడి నెలకొంది.

Fishermen who go fishing at east godavari district
Fishermen who go fishing at east godavari district

By

Published : May 31, 2020, 2:39 PM IST

సముద్రంలో చేపల వేటకు రంగం సిద్దమైంది. చేపల వేటపై 61రోజులు ఉన్న నిషేధాన్ని 47 రోజులకు కుదించి వేటకు అనుమతిస్తున్నారు. మే 31 అర్ధరాత్రి 12 గంటలతో నిషేధం ముగుస్తుంది. కొవిడ్ జాగ్రత్తలలో భాగంగా మత్స్యకారులకు, వేలం పాటదార్లకు, బోట్ యజమానులు, కళాసీలు తమ పనులకు సిద్ధమవుతున్నారు.

లాక్ డౌన్ కారణంగా జీవనం కష్టంగా మారిన వారికి.. సడలింపులతో ఊరట లభించింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని 20 వేల మత్స్య కుటుంబాలు వేటకు సిద్ధమవుతున్నాయి. సముద్రంలో, గోదావరి పాయలలో వేటకు వెళ్లేందుకు అవసరమైన నావలు, వలలు, నిత్యవసర సరుకులు, చేపలను నిలవ ఉంచేందుకు ఐస్ కేల్లు, బోట్లులోకి చేరుస్తుండటంతో... సావిత్రి నగర్ జెట్టీల వద్ద సందడి నెలకొంది.

ఇదీ చదవండి:వలస కూలీల కష్టం కలచివేసింది : మోదీ

ABOUT THE AUTHOR

...view details