రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న హోం క్వారంటైన్ మెడికల్ కిట్లలో పల్స్ ఆక్సీమీటర్, ప్రాథమిక చికిత్స మందులు, శానిటైజర్, లిక్విడ్ సోప్, హైపోక్లోరైట్, టిష్యూ పేపర్లు, సర్జికల్ మాస్కులు, గ్లౌజులు, కవర్లు, ఎ-విటమిన్, పారాసిట్‌మాల్ మందులు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 20 వేల కిట్ల వరకు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంటిలో ప్రత్యేకంగా ఓ గది, మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న వారికి హోం క్వారంటైన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
కరోనా బాధితులకు హోం క్వారంటైన్ కిట్లు - ఏపీలో కరోనా హోం క్వారంటైన్ కిట్లు న్యూస్
కరోనా బారినపడి ఇంటి వద్దే చికిత్స పొందుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం హోం క్వారంటైన్ మెడికల్ కిట్లను అందిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 460 కిట్లను బాధితులకు పంపిణీ చేసినట్లు జాయింట్ కలెక్టర్-2 బి.రాజకుమారి తెలిపారు.
corona home quarantine kits distribute by ap govt