అనపర్తి మండలంలో 12 మంది విద్యార్థులకు కరోనా - తూర్పుగోదావరి జిల్లా ముఖ్య వార్తలు
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో 12 మంది విద్యార్థులకు కరోనా సోకింది. శనివారం మరో 84 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రామవరం పీహెచ్సీ వైధ్యాధికారి కోటిరెడ్డి తెలిపారు.

అనపర్తి మండలంలో 12 మంది విద్యార్థులకు కరోనా
తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. అనపర్తి మండలం పీరా రామచంద్రాపురంలోని ఎంపీపీ పాఠశాలలో 9 మంది, పొలమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకిందని రామవరం పీహెచ్సీ వైధ్యాధికారి కోటిరెడ్డి తెలిపారు. దీంతో శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మెుత్తం 84 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆయన వెల్లడించారు. వాటి ఫలితాలు రావల్సి ఉందని డా. కోటిరెడ్డి తెలిపారు.