ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అత్యవసర సేవలపై కరోనా ప్రభావం..

By

Published : Aug 10, 2020, 1:25 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో ఊహించని స్థాయిలో ఒక్కరోజే 1500 దాటి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీని ప్రభావం ప్రజలకు అత్యవసర సేవలు అందించే ఆసుపత్రులు.. ఆర్థిక లావాదేవీలకు మూలమైన బ్యాంకుల పైన పడింది.

corona effect on hospitals and banks in east godavari dst
corona effect on hospitals and banks in east godavari dst

కరోనా వైరస్​ కారణంగా ప్రజలకు అత్యవసర సేవలు అందడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజవర్గం పరిధిలోని తాళ్లరేవు, ఐ పోలవరం, ముమ్మడివరం, కాట్రేనికోన మండలాల గ్రామ ప్రజలందరికీ అత్యవసర వైద్య సేవలు అందించే కేంద్రపాలిత యానాంలోని ప్రభుత్వాసుపత్రిలో సిబ్బందికి వైరస్ సోకింది.

భారతీయ స్టేట్ బ్యాంక్ యానాం శాఖకు ముమ్మడివరం ఇతర నియోజకవర్గాలకు చెందినవారు ఖాతాదారులుగా ఉన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం.. రైతులు రుణాలు.. ఇతరలావాదేవీలకు వచ్చిన వారి ద్వారా బ్యాంక్ సిబ్బందిలో ఐదుగురు కరోనా బారిన పడ్డారు.

ప్రస్తుత యానంలో 5 రోజులపాటు పూర్తి లాక్ డౌన్ విధించడంతో బ్యాంకు మూసివేశారు.. బుధ గురువారాలు మాత్రమే పని దినాలుగా ఉండటంతో ఖాతాదారులు తాకిడి ఎక్కువగానే ఉండనుంది. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సగం సిబ్బందితో సేవలందించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

కరోనా నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ ఒక్కొక్కరినే బ్యాంకులో అనుమతించటంతో అందరికి సేవలు అందుతాయా అనేది ప్రశ్నార్థకరంగా మిగిలింది.

ఇదీ చూడండి

24 గంటల వ్యవధిలో 10,820 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details