లాక్డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. మే 2 నుంచి 8వ తేదీ వరకు కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. 3న స్వామివారి కల్యాణం జరగనుంది. అప్పటి వరకు లాక్డౌన్ అమల్లో ఉన్నందున భక్తులను అనుమతించకుండా కొద్ది మంది వైదిక బృందంతోనే ఈ వేడుక జరిపించనున్నారు. అయితే ఈ కల్యాణానికి భక్తులు 1,116 రూపాయలు ఆన్లైన్ ద్వారా దేవస్థానానికి చెల్లిస్తే కల్యాణ వేదిక వద్ద వారి పేరు మీద గోత్ర నామాలతో పూజ చేస్తామని ఈవో త్రినాథరావు తెలిపారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణంపై కరోనా ప్రభావం - అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం
అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కల్యాణంపై కరోనా ప్రభావం పడింది. ప్రతి ఏటా వైభవంగా సాగే ఈ వేడుక.... ఈ ఏడాది నిరాడంబరంగా నిర్వహించనున్నారు. భక్తులు లేకుండానే స్వామి వారి కల్యాణాన్ని జరపనున్నారు.
annavaram satyanarayana swami kalyanam
ఇదీ చదవండి