రావులపాలెం యువకుడు ఆస్పత్రికి తరలింపు..ఎందుకంటే..! - రావులపాలెంలో కరోనా అనుమానిత వ్యక్తిని ఆస్పత్రికి తరలింపు
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఒక యువకుడిని అధికారులు కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల విజయవాడకు చెందిన యువకుడికి ఈనెల 8న కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ రావులపాలెం యువకుడు, విజయవాడ యువకుడు స్నేహితులు. వీళ్లిద్దరూ మార్చి 24న దిల్లీ నుంచి విమానంలో వచ్చారు. ఈ నేపథ్యంలో రావులపాలెం యువకుడికి వైద్య పరీక్షలు చేసేందుకు కాకినాడ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
corona-doubt-person
.