ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి - రావులపాలెం తాజా వార్తలు

పచ్చని కుటుంబంలో కరోనా మహమ్మారి చిచ్చు పెట్టింది. రెండు వారాల వ్యవధిలోనే ఒకే కుటుంబంలోని ఐదుమందిని బలితీసుకుంది. మరోవైపు ఈ కుటుంబానికి చెందిన మరో ఏడుగురు కొవిడ్‌ బారిన పడ్డారు.

కుటుంబంలో కొవిడ్‌ కల్లోలం ... కొవిడ్‌తో ఐదుగురు.. క్యాన్సర్‌తో ఒకరి మృతి
కుటుంబంలో కొవిడ్‌ కల్లోలం ... కొవిడ్‌తో ఐదుగురు.. క్యాన్సర్‌తో ఒకరి మృతి

By

Published : Aug 14, 2020, 9:05 AM IST

Updated : Aug 14, 2020, 9:44 AM IST

కరోనా మహమ్మారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. రెండు వారాల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కరోనాతో, ఒకరు క్యాన్సర్‌తో కన్నుమూయడం విషాదానికి పరాకాష్టగా నిలిచింది.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. తొమ్మిది మంది మగవారు, ఒక ఆడ సంతానం ఉన్న పెద్ద కుటుంబం రావులపాలెంలో నివసిస్తోంది. అందులో మొదటి సంతానమైన వృద్ధురాలు(77) కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ జులై 26న చనిపోయారు. ఈ విషాదాన్ని మరువక ముందే ఆమె మొదటి, మూడో తమ్ముళ్ల కుటుంబాలకు చెందిన అయిదుగురు కరోనా వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందారు. వృద్ధురాలి పెద్ద తమ్ముడు(75) ఆగస్టు 6న, ఆయన కుమారుడు(52) జులై 26న చనిపోయారు. మూడో తమ్ముడి కుటుంబంలోని ఆయన భార్య(63) ఆగస్టు 5న, ఆయన కుమారుడు(42) జులై 30న, మనవడు(17) ఆగస్టు 6న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరోవైపు ఈ కుటుంబానికి చెందిన మరో ఏడుగురు కొవిడ్‌ బారిన పడ్డారు. అందులో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నలుగురు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఒకరు కోలుకున్నారు.

ఇవీ చదవండి

కోరలు చాస్తున్న కరోనా.. నిర్లక్ష్యం వీడని ప్రజలు

Last Updated : Aug 14, 2020, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details