తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కోనసీమలో 511 కొవిడ్ కేసులు నమోదు అయినట్లు అమలాపురం డివిజన్ అడిషనల్ డీఎమ్హెచ్వో డాక్టర్ సీహెచ్ పుష్కరరావు తెలిపారు. నిన్న ఒక్కరోజే 50 మందికి నిర్థరణ అయినట్లు వివరించారు. ఇప్పటి వరకు 200 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. ప్రజలంతా వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ... కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కోనసీమలో కరోనా కల్లోలం... రోజురోజుకి పెరుగుతున్న బాధితులు - konaseema corona update
కరోనా వైరస్ వ్యాప్తి కోనసీమలో ఎక్కువగా ఉంది. కోనసీమలో కొవిడ్ బాధితులు 500 మంది దాటినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కోనసీమలో కరోనా