తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, మల్కిపురం, మండపేట తదితర ప్రాంతాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బయట ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారి ద్వారా, జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లి వచ్చిన వారికి కరోనా వైరస్ సోకుతోంది. తాజాగా కాకినాడ గ్రామీణ మండలం రేపూరులో కాశీ యాత్రకు వెళ్లి వచ్చిన వారిలో కొందరికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ గ్రామాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించి.. అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఇంఛార్జ్ వైద్యాధికారి ప్రసన్నకుమార్ విజ్ఞప్తి చేశారు.
పెరుగుతున్న కరోనా కేసులు...అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కాకినాడ గ్రామీణ మండలం రేపూరులో కాశీ యాత్రకు వెళ్లి వచ్చిన వారిలో కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఇంఛార్జ్ వైద్యాధికారి విజ్ఞప్తి చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు