ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండపేటలో కరోనా ఉగ్రరూపం.. ఒకేరోజులో 28 కేసులు - మండపేటలో కరోనా కేసులు

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ ఒక్క రోజే 28 కేసులు నమెదయ్యాయి. కరోనా కట్టడికి మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. నిబంధనలు పాటించకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

corona cases at mandapeta
మండపేటలో కరోనా ఉగ్రరూపం

By

Published : Jul 15, 2020, 8:50 PM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే పట్టణంలో 42 పాజిటివ్ కేసులు ఉండగా.. బుధవారం ఒక్కరోజే 28 కేసులు నమోదయ్యాయి. వీటితో మండపేటలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 70కి చేరింది. కరోనా పరీక్షలు అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నప్పటికీ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్త జిల్లాలు... అధ్యయనానికి కమిటీ ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details