లాక్డౌన్ సడలించినప్పటి నుంచి తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అమలాపురం డివిజన్లో శుక్రవారం నాటికి 164 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా 12 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి మహమ్మారి నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ పుష్కర రావు సూచించారు.
కోనసీమలో కరోనా అలజడి..రోజురోజుకు పెరుగుతున్న కేసులు - తూర్పు గోదావరిలో కరోనా కేసులు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా అలజడి సృష్టిస్తోంది. లాక్డౌన్ సడలించినప్పటి నుంచి అమలాపురం డివిజన్లో కేసులు పెరుగుతున్నాయి. అమలాపురం డివిజన్లో శుక్రవారం నాటికి 164 కేసులు నమోదయ్యాయి.
కోనసీమలో కరోనా అలజడి