ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రావులపాలెంలో పెరుగుతున్న కరోనా బాధితులు - east godavari district ravulapalem latest news

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఊబలంక పీహెచ్​సీ వైద్యాధికారి దుర్గాప్రసాద్ నిర్ధరించారు. ఆర్టీసీ డ్రైవర్​కు వైరస్ సోకింది. ఓ బ్యాంకు ఉద్యోగికి ఇప్పటికే పాజిటివ్​ రాగా.. ఆయన భార్యకూ పరీక్షలు చేశారు. ఆమెకు సైతం కరోనా నిర్ధరణ అయినట్లు చెప్పారు.

corona cases increased
రావులపాలెంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా

By

Published : Jun 30, 2020, 1:02 AM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని ఇందిరాకాలనీలో ఉంటున్న ఆర్టీసీ డ్రైవర్​కు కరోనా వచ్చింది. డిప్యుటేషన్​పై ఏలూరు ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఏలూరు వెళ్లి వస్తుండటం ఈ మధ్య తరుచుగా జ్వరం రావడం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు పీహెట్​సీ వైద్యాధికారి దుర్గాప్రసాద్​ వెల్లడించారు.

మండపేటలో బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్న ఒక వ్యక్తికి పాజిటివ్ గా నమోదు అయ్యింది. దీంతో రావులపాలెంలో ఉంటున్న అతని భార్యకు పరీక్ష చేయగా పాజిటివ్​గా తేలింది. ఆమె కూడా రావులపాలెం తపాలా కార్యాలయాలంలో పని చేయడం కొంత భయాందోళన కలిగిస్తున్న అంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details