తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 70 వేల జనాభా కలిగిన యానంలో మొత్తం 2200 మందికి పరీక్షలు నిర్వహించగా 262 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. 93 మంది చికిత్స అనంతరం కోలుకొని ఇంటికి వెళ్లగా.. ప్రస్తుతం 166 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 70 సంవత్సరాలు పైబడిన ముగ్గురు మహిళలు ఇతర అనారోగ్య సమస్యలతోపాటు కరోనా ప్రభావంతో మృతి చెందారని డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా తెలిపారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆదేశాల మేరకు యానం సామాన్య ఆసుపత్రిని పూర్తిగా కొవిడ్ చికిత్స కేంద్రంగా మార్పుచేసి 200 పడకల అందుబాటులో ఉంచుతున్నారు. ఇవి కాక అదనంగా మెట్టుకుర్రు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను 80 పడకల ఆసుపత్రిగా మార్చి అన్ని సౌకర్యాలు కల్పించారు. జనరల్, అవుట్ పేషెంట్లు కోసం మహాత్మ బాలుర పాఠశాలను తాత్కాలిక ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారు.
- అధైర్యపడవద్దు..104 కు కాల్ చేయండి.
కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నా.., ఇతర ఏ రకమైన వ్యాధులతో బాధపడుతున్నా అధైర్యపడకుండా స్థానిక ఆశా వర్కర్ లేదా 104 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలని .. డాక్టర్ల పరిశీలన అనంతరం హోమ్ క్వారంటెన్ లేదా హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స మందులు ఇస్తారని, అత్యవసర పరిస్థితి అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని ఆరోగ్య శాఖ అధికారి కాశి సత్యనారాయణ తెలిపారు.
- ఆగస్టు నెల అత్యంత కీలకం:: డిప్యూటీ కలెక్టర్ మీనా