ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కలకలం... 2 రోజుల్లో 28 కేసులు! - corona cases in eastgodawari

తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలో కరోనా విజృంభిస్తోంది. రెండు రోజులుగా 28 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వైరస్ ఎలా ప్రబలిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెప్పారు.

విజృంభిస్తోన్న కరోనా...అప్రమత్తమైన అధికారులు
విజృంభిస్తోన్న కరోనా...అప్రమత్తమైన అధికారులు

By

Published : May 24, 2020, 5:39 PM IST

తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలో కరోనా మహమ్మారి ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండు రోజులుగా 28 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మండలంలో తొలి పాజిటివ్ కేసుకు అనుబంధంగానే ఈ కేసులన్నీ నమోదయ్యాయి. అప్రమత్తమైన అధికారులు కేసులు నమోదైన గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు ముమ్మరం చేశారు.

గ్రామస్తుల నమునాలు సేకరించి పరీక్షలకు తరలించారు. అయితే.. వైరస్ ఇంతగా ప్రబలడానికి కారణం ఏంటన్న దానిపై స్పష్టత రాలేదని అధికారులు చెప్పారు. ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. దగ్గు, ఆయాసం, జ్వరం వాటి లక్షణాలు ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details