ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మడికిలో గర్భిణీ సహా ఇద్దరికి కరోనా - మడికిలో కరోనా కేసుల వార్తలు

తూర్పుగోదావరి జిల్లా మడికిలో ఇద్దరికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయ్యింది. ఈ క్రమంలో గ్రామాన్ని అధికారులు సందర్శించి ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు.

corona cases in madiki alamuru mandal east godavari district
మడికిలో కరోనా కేసులు

By

Published : Jul 13, 2020, 2:54 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికిలో ఇద్దరికి కరోనా సోకింది. గ్రామానికి చెందిన గర్భిణీకి, మరో యువకుడికి పాజిటివ్ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. వైరస్ నిర్ధరణ అయిన ప్రాంతాలను ఎస్​ఐ శివప్రసాద్, తహసీల్దార్ వెంకటేశ్వరి, ఎంపీడీవో ఝాన్సీ సందర్శించారు. ప్రత్యేక పారిశద్ధ్య చర్యలు చేపట్టారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. లేనిపక్షంలో ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details