తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 20న కరోనా పాజిటివ్ లక్షణాలతో కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందిన 53 ఏళ్ల వ్యక్తి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల్లో 28 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. తాజాగా మరో 9 మందికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు.
వీటిలో.. గొల్లల మామిడాడలో 5, బిక్కవోలు మండలంలో 4 కేసులు నమోదవ్వగా.. అందులో 21 ఏళ్ల గర్భిణీ, 9 ఏళ్ల బాలిక ఉన్నారు. కేసుల ఉద్ధృతి పెరుగుతున్న కారణంగా.. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గొల్లల మామిడాడను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించగా.. కొన్ని ప్రాంతాలను రెడ్, బఫర్ జోన్లుగా గుర్తించారు. అనపర్తిలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే దుకాణాలు తెరవాలని ఆదేశాలిచ్చారు.