ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రియాశీల కేసుల్లో అగ్రపథాన తూర్పు గోదావరి జిల్లా - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కుదిపేస్తోంది. నిత్యం కమ్మేస్తున్న పాజిటివ్‌ కేసులతో ఆందోళన నెలకొంది. రోజువారీ డిశ్చార్జిలు కొంత ఊరటనిస్తున్నా.. అంతకు కొన్ని రెట్లు యాక్టివ్‌ కేసులు తెరమీదకు వస్తున్నాయి. ముందస్తుగా ఆసుపత్రుల్లో పడకలు, ఇతర వసతులను పెంచడంపై అధికారులు దృష్టిసారించారు. ఇదేక్రమంలో కొవిడ్‌ సేవలకు వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నారు.

క్రియాశీల కేసుల్లో అగ్రపథాన తూర్పు: కోలుకుంటున్నా... కొత్త వాటితో కలకలం !
క్రియాశీల కేసుల్లో అగ్రపథాన తూర్పు: కోలుకుంటున్నా... కొత్త వాటితో కలకలం !

By

Published : Aug 1, 2020, 12:41 PM IST

కరోనా పాజిటివ్‌ యాక్టివ్‌ కేసుల విషయంలో మరింత నిశిత పరిశీలన అవసరం. అత్యవసరమనే పిలుపు వచ్చిన కేసులను 108, ఆర్‌బీఎస్‌కే అంబులెన్సుల్లో.. కోలుకున్న వారిని తరలించడానికి బస్సులనూ వినియోగిస్తున్నారు. ఇందుకు తూర్పుగోదావరి జిల్లాలో 64 వాహనాలు అందుబాటులో ఉన్నా కేసుల తీవ్రత నేపథ్యంలో వీటి సంఖ్య మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. కొందరు అవగాహన లేమితో అనారోగ్యంగా ఉన్నా గోప్యంగా ఉంచడం, నిర్లక్ష్యం చేసి విషమించాక అత్యవసర సేవలను ఆశ్రయిస్తున్నారు. కొవిడ్‌ నిర్ధారణ అయితే తప్ప ఆయా వాహనాల్లో ఆసుపత్రులకు తరలించే పరిస్థితి లేదు. దీంతో కాలయాపన కొందరి ప్రాణాలను హరిస్తోంది.

అందుబాటులో వనరులు...

అత్యవసర కేసులకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో సేవలు అందిస్తున్నారు. వయసు మీరిన, ప్రమాదకర కేసులను విశాఖలోని విమ్స్‌కు తరలిస్తున్నారు. మిగిలిన బాధితులకు రాజానగరం పరిధిలోని జీఎస్‌ఎల్‌, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, కిమ్స్‌ బొల్లినేని, అమలాపురంలోని కిమ్స్‌, కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్‌), హోప్‌ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నారు. ఇంట్లో వసతులు లేక హోమ్‌ ఐసోలేషన్‌ పొందలేని పాజిటివ్‌ కేసులను బొమ్మూరు, బోడసకుర్రులో కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు (సీసీసీ) తరలిస్తున్నారు. ప్రస్తుత ఆసుపత్రులు, సీసీసీల్లో 10,502 పడకలు అందుబాటులో ఉంచారు. సాధారణ, ఐసీయూ, నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయి.

జిల్లాలో యాక్టివ్ కేసులు

శరవేగంగా వసతులు...

ఐదు డివిజన్లలో కొత్తగా కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇవన్నీ రెండు నుంచి ఐదు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఎటపాక డివిజన్‌లోని చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో 150 చొప్పున పడకలతో కొత్తగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రంపచోడవరంలో 1,000, కాకినాడ జేఎన్‌టీయూలో 1,500.. సామర్లకోట, పెద్దాపురం టిడ్కో సముదాయాల్లో 1,000 పడకల చొప్పున సీసీసీలు ఏర్పాటు కానున్నాయి. రామచంద్రపురంలోని ఆదివారపుపేటలో 300, విజయ ఫంక్షన్‌ హాలులో 100, మండపేట టిడ్కోలో 500 పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నారు.

జిల్లాలో డిశ్చార్జిలు

తక్షణమే తరలించేలా చర్యలు

"కొవిడ్‌ లక్షణాలు.. ఇతర వ్యాధులు ఉన్న వారిని తక్షణమే కొవిడ్‌ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సపోర్టు ఇస్తున్నాం. బయటకు లక్షణాలు లేని వారిని, స్వల్ప లక్షణాలు ఉండి ఇంట్లో వసతులు లేని వారిని బొమ్మూరు, బోడసకుర్రు కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉంచుతూ వారిని పర్యవేక్షిస్తున్నాం. ప్రతి ఆసుపత్రిలో 247 హెల్ప్‌ డెస్కులు ఏర్పాటుచేశాం. ప్రత్యేక అధికారులను, వారికి సహాయకులను నియమించాం."

- రాజకుమారి, జేసీ (సంక్షేమం)

ఇదీచదవండి

రాష్ట్రంలోకి వచ్చేవారికి సడలింపు... ఆటోమేటిక్ ఈ-పాస్​తో ఎంట్రీ

ABOUT THE AUTHOR

...view details