తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 10 వేల మార్క్ దాటింది. జిల్లాలో ఇప్పటి వరకు 10,038 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6,786 ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 3,156 మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ఇప్పటి వరకు 96 మంది కరోనాతో మరణించారు. వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అందరూ నిబంధనలు పాటించి మాస్కు ధరించాలని చెబుతున్నారు.
జిల్లాలో 10వేల మార్క్ దాటిన కరోనా కేసులు - తూర్పుగోదావరి జిల్లాలో 10వేల మార్క్ దాటిన కరోనా కేసులు
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు పాటించి.. మాస్కులు ధరించాలని స్పష్టం చేస్తున్నారు.
corona cases in east godavari