రాష్ట్రంలో కరోనా విస్తరిస్తోంది. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వద్ద 12 ఏళ్లుగా గన్‌మన్‌గా పనిచేస్తున్న సురేష్ శుక్రవారం మృతిచెందారు. అనంతరం కరోనా పరీక్షలు చేయగా, శనివారం పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సహా.. మిగిలిన అంగరక్షకులు, ఇతర సిబ్బందిని పరీక్షించారు. వారిలో ముగ్గురు అంగరక్షకులు, ముగ్గురు ఇతర సిబ్బందికి కరోనా ఉన్నట్లు తేలింది. తనకు రెండుసార్లు చేసిన పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చినట్లు ఎమ్మెల్యే మీడియాకు తెలిపారు. మరోవైపు.. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో కొవిడ్ - 19 బాధితులకు చికిత్సలు చేస్తున్న ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులకు ఆదివారం పాజిటివ్‌గా ఖరారైంది. వీరితో సన్నిహితంగా మెలిగిన వైద్యులు, ఇతర వైద్య విద్యార్థులను గుర్తించి పరీక్షిస్తున్నారు.
గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారికీ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ జె.యాస్మిన్ సహా 61 మంది ఉద్యోగులకు పరీక్షలు చేశారు. ఆ ఉద్యోగి కలెక్టరేట్‌లోని కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు నిత్యం వచ్చి వెళ్తారని గుర్తించి కలెక్టరేట్‌లో పనిచేసే ఉద్యోగులకూ సోమవారం పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు పంచాయతీ శివారు సూర్యారావుపేటలో ఆదివారం 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఇక్కడ 14 కేసులుండగా.. కొత్త వాటితో కలిపి ఆ సంఖ్య 40కు చేరింది. పాజిటివ్ వచ్చినవారంతా ఇటీవల జిల్లాలోని పెదపూడి మండలం జి.మామిడాడలో జరిగిన వివాహ వేడుకకు వెళ్లి వచ్చినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరులోని జిల్లా కేంద్ర కారాగారంలో ఇద్దరు రిమాండ్ ఖైదీలకు కరోనా సోకింది. ఆదివారం ఒక్కరోజే ఈ జిల్లాలో 36 పాజిటివ్ కేసులు వచ్చాయి. చికిత్స పొందుతూ ఇద్దరు మరణించడంతో జిల్లాలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.
కర్నూలులో వెయ్యికి సమీపంగా..