తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా యువత వైరస్ బారిన పడుతున్నారు. హెచ్చరిస్తున్నా లెక్కలేని తనమే దీనికి కారణంగా కనిపిస్తోంది. గతంలో రామచంద్రపురంలో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఓ యువకుడి ద్వారా పదుల సంఖ్యలో వైరస్ వ్యాపించింది. కాకినాడ, రాజమహేంద్రవరంలోనూ కలియ తిరిగిన యువకుల ద్వారా ఎక్కువ కేసులు నమోదైనట్లు ధ్రువీకరించారు. మార్కెట్లు, వ్యాపార సముదాయాల ప్రాంగణాల్లో గుంపులుగా తిరుగుతున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారు వైద్యులను సంప్రదించాలని అధికారులు పదేపదే హెచ్చరించినా మొదట గోప్యంగా ఉంచేవారు. ఇప్పుడు పరీక్షలకు పోటీపడుతుంటే పరిస్థితులు అనుకూలించడం లేదు. కాకినాడ జిల్లా ఎస్పీ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ పరిధిలో రూ.కోట్లలో అపరాధ రుసుము వసూలైందంటే అతిక్రమణల తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు.
- కలబడవద్ధు...
కరోనాను కట్టడి చేయాలంటే భౌతిక దూరం తప్పనిసరని తెలిసినా కొందరు నిబంధనలను పాటించడం లేదు. రాజమహేంద్రవరం పుష్కరఘాట్ కూడలిలో దాతలిచ్చే ఆహార పొట్లాలకోసం ఎగబడుతున్న అన్నార్తుల చిత్రమిది.
- కలివిడే హద్ధు.
కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్న రోగులతో రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ అసుపత్రి ఆవరణ కిటకిటలాడుతోంది. రోగులు గుమిగూడకుండా.. వరుసగా కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. ఉదయం 7 గంటల నుంచి వచ్చిన వీరంతా సాయంత్రం వరకు ఓపికగా నిరీక్షించారు.
- పిల్లలు జాగ్రత్త
పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువ. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. సడలింపు వేళ బయటకు పంపితే వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనే స్వచ్ఛత పాఠాలు నేర్ఫి. ఆన్‌లైన్ తరగతులు, కాలక్షేపంతో ఆటల లోటు రానీయకుండా చూడాలని సూచిస్తున్నారు.
- యువతా మేలుకో..
యువతలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నా.. వారు కోలుకుంటున్నా.. వీరి నుంచే వ్యాప్తి ఎక్కువగా ఉంది. వ్యసనపరులు, అనారోగ్యం ఉన్నవారు కోలుకోవడం కష్టంగా ఉంది. ఇష్టారీతిన తిరగడం, స్నేహితులు, పార్టీల పేరుతో కాలక్షేపంపై కలెక్టరే ఆక్షేపించారు. అందరి హితం కోరుతూ అత్యవసరమైతేనే యువత బయటకు రావాలి.
- పెద్దలూ పదిలం