తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అమలాపురం డివిజన్లో ఇప్పటి వరకు 585 కేసులు నమోదయ్యాయని డివిజన్ అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సీహెచ్ పుష్కర రావు తెలిపారు. ఇప్పటి వరకు చికిత్స పొంది 240 మంది క్షేమంగా ఇళ్లకు చేరారు మిగిలిన వారు అమలాపురంలోని కిమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో, హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
కోనసీమలో కరోనా కలకలం.. విజృంభిస్తున్న మహమ్మారి - అమలాపురంలో కరోనా
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 585 కేసులు నమోదయ్యాయని డివిజన్ అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సీహెచ్ పుష్కర రావు వెల్లడించారు.
అమలాపురంలో కరోనా