ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయినవిల్లి మండలంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎన్​. పెదపాలెం గ్రామంలో తొలిగా బయట పడిన కరోనా పాజిటివ్​ కేసు.. క్రమంగా విస్తరించి ప్రస్తుతం 42కు చేరుకుంది. అధికారులు ఈ మండలాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు.

corona cases are increasing in ainapalli mandal in east godavari district
మండలంలో పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Jun 19, 2020, 6:33 PM IST

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు 42 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ నెల 15,16 తేదీల్లో... మండలంలో 185 మందికి పరీక్షలు చేశారు. ఈ ఫలితాలు శుక్రవారం వచ్చాయి. వీరిలో 12 మందికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ మండలంలోని ఎన్​. పెదపాలెం గ్రామంలో ఉంటున్న దంపతులకు కరోనా పాజిటివ్​ను మొదటగా గుర్తించారు. ప్రస్తుతం 42 కేసులు ఉండటం వల్ల ఆరు రోజులుగా అయినవిల్లి మండలం అంతటా రెడ్​ జోన్​గా ప్రకటించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details